SSMB29 : సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ సినిమా SSMB29 గురించి రోజుకో కొత్త అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో తెరకెక్కుతుండగా.. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా కోసం రాజమౌళి కొత్త స్ట్రాటజీ ను అనుసరిస్తున్నాడు. సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు ముందు ప్రెస్ మీట్‌లు నిర్వహించి స్టోరీ, నటులను, సాంకేతిక వివరాలను వెల్లడిస్తాడు. కానీ ఈ సినిమా విషయంలో ఆయన పూర్తి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సినిమా ప్రమోషన్‌లను పక్కనపెట్టి కొత్త స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. ఈ స్ట్రాటజీ ప్రకారం.. సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్ లేదా ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయకుండా సినిమా హైప్‌ను పెంచాలని ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ బాబు లుక్‌ను రహస్యంగా ఉంచడం ఈ స్ట్రాటజీలో కీలక భాగం. ఒడిశాలోని షూటింగ్ సెట్ నుండి కొన్ని వీడియోలు, ఫొటోలు లీక్ అయినప్పటికీ అవి స్పష్టంగా లేకపోవడం వల్ల మహేష్ లుక్ గురించి పూర్తి సమాచారం బయటకు రాలేదు. కొందరు ఈ లీక్‌లను సినిమా హైప్‌ను పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినవిగా కూడా భావిస్తున్నారు.
రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రమోషన్‌లు చేయకుండా, సోషల్ మీడియాలో జరిగే చర్చలు, లీక్‌ల ద్వారా సినిమాపై ఆసక్తిని కొనసాగిస్తున్నాడు. ఈ విధానం గతంలో రాజమౌళి సినిమాలకు భిన్నంగా ఉంది.. ఎందుకంటే ”బాహుబలి” మరియు ”ఆర్‌ఆర్‌ఆర్” సినిమాలకు భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ SSMB29 విషయంలో.. రహస్యంగా ఉంచడం ద్వారా అభిమానుల్లో హైప్ ను పెంచి.. సినిమా విడుదల సమయంలో భారీ ఆసక్తిని సృష్టించాలనే లక్ష్యంగా కనిపిస్తోంది.