SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ”SSMB29” అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాపై కథపై రచయిత విజయేంద్ర ప్రసాద్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని మేము ప్లాన్ చేస్తున్నాము అని ఆయన అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు అని తెలిపారు. త్వరలో కెన్యాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, ఇతర నటీనటులతో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అని వెల్లడించారు.
ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఇందులో హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి అని అన్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ లెవల్ లో రాజమౌళి తీస్తున్నారు అని అన్నారు. దీంతో ఈ సారి కచ్చితంగా హాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టడం కాయం అని తెలుస్తుంది. ఈ సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనుంది.ఈ సినిమాని దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.