Rajanala : రాజనాల (Rajanala) నెల్లూరు జిల్లాలోని కావలిలో జన్మించారు. రాజనాల ‘ప్రతిజ్ఞ’ సినిమాలో నెగటివ్ రోల్‌లో నటించాడు. ఆ తర్వాత విలన్ పాత్రలో రాణించాడు. రాజనాల తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమను దశాబ్దాలుగా విలన్ మరియు హాస్యనటుడిగా పరిపాలించారు. ఒక్కప్పుడు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్ రావు, కాంతారావు సినిమాలు రాజనాల లేకుండా ఉండేవి కాదు. ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. కానీ చివరి రోజుల్లో మాత్రం రాజనాల కటిక పేదరికం అనుభవించారు. అసలు అయన సంపాదించిన కోట్ల ఆస్థి ఏమయ్యాయి అని ప్రశ్న వస్తుంది. వందల సినిమాల్లో నటించి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా.. వాటిని దానధర్మాలకు, వ్యసనాలకు వాడుకుంటూ ఆర్థికంగా చాలా చితికిపోయారు. అలాంటి సమయంలో సినిమాల్లో అవకాశాల కోసం మద్రాసు నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. అడపా దడపా సినిమా అవకాశాలు వచ్చేవి. రాజనాల తన చివరిరోజుల్లో ఉండానికి ఇల్లు లేకుండా ఒక సినిమాలో వేషం కోసం అయన చాలా కష్టపడ్డాడు. అయన చివరికి డైరెక్టర్ కోడి రామకృష్ణ ని ఒక అవకాశం కోసం అడగాల్సిన దుస్థితి వచ్చింది. ఆ తరువాత కృష్ణ హీరోగా నటించిన ‘వీర లేవర’ అనే తెలుగు సినిమాలో నటిస్తున్నప్పుడు, ఆయన ఆరోగ్యం క్షీణించి, ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్రమైన డయాబెటిస్ కారణంగా, ఆయన కాలి వేలుకు ఇన్ఫెక్షన్ సోకడంతో మొత్తం కాలుకు వ్యాపించడంతో కాలును తొలగించారు. ఆ తర్వాత, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి, మే 21, 1998న తుది శ్వాస విడిచారు.