ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల బీజేపీ నాయకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది స్వగృహానికి వచ్చిన సందర్బంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వరీ స్వామి ఆశీస్సులు అతని పై ఉన్నందునే ఇంత త్వరగా కోరుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌళ్ళ క్రాంతి, మాజీ మండల అధ్యక్షులు కార్తిక్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి కోల్ల కృష్ణగౌడ్, మాజీ ఓబీసీ మండల అధ్యక్షులు జిల్లల మల్లేశం, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్,అవునూర్ గ్రామ బూత్ అద్యక్షులు నక్కల రాజు, బత్తుల గణేష్ పాల్గొన్నారు.