Rajasaab : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా ‘రాజాసాబ్’. ఈ సినిమా టీజర్ జూన్ 16న విడుదల కానుంది. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా టీజర్‌లో ప్రభాస్ డైనోసార్ అవతార్‌లో కనిపించనున్నాడని, ఇది ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ చూడని విజువల్ ఫీస్ట్ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ టీజర్ కోసం సంగీత దర్శకుడు థమన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించినట్లు సమాచారం. దర్శకుడు మారుతి టీజర్‌ను అదిరిపోయే రేంజ్‌లో కట్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే లీకైన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తున్నాయి. జూన్ 16న హైదరాబాద్ ఐమాక్స్‌లో జరిగే మీడియా మీట్‌లో టీజర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రభాస్ తప్ప మిగతా చిత్ర బృందం ఈ ఈవెంట్‌లో పాల్గొననుంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అభిమానులు అంటున్నారు.