HomeతెలంగాణRajasing: రాజాసింగ్ కు పట్టిన గతే పడుతుంది-మంత్రి శ్రీనివాస్ గౌడ్

Rajasing: రాజాసింగ్ కు పట్టిన గతే పడుతుంది-మంత్రి శ్రీనివాస్ గౌడ్

Rajasing : తెలంగాణ లో రక్తం పారించాలని చూస్తే… బిడ్డ ఖబడ్దార్… అలాంటి వాళ్ళందరికీ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు పట్టిన గతే పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణలో అశాంతి నెలకొల్పాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఒక కార్యక్రమంల కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎంకి చెందిన సుమారు 300 మంది మంత్రి సమక్షంలో అధికార పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి స్వాగతించారు.

మత కలహాలు కఠినంగా శిక్ష

మతకలహాలు సృష్టించాలని ప్రయత్నం చేసిన రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసిన తీరుగానే అలాంటి వ్యక్తులను భవిష్యత్తులోనూ కఠినంగా అణచివేస్తామన్నారు. తెలంగాణను ఆగం చేయాలని, తెలంగాణలో మతకలహాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఎంతటి పెద్ద నాయకుడైనా రాజాసింగ్ కు పట్టిన గతే పడుతుందని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలకు ఎవరు హాని కలిగించాలని ప్రయత్నం చేస్తే ఎంతటి వారైనా వదలబోమని తెలిపారు. బిజెపి నేతలు అసందర్భంగా, అసత్యంగా చేస్తున్న ప్రసంగాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడి అమాయకుల ప్రాణాలు బలి కొనాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు.

ఈడీ, పీడీ లకు కేసిఆర్ భయపడడు

బిజెపి నేతల ఈడి, పీడీ బుడ్డ బెదిరింపులకు కేసీఆర్ భయపడడని తెలిపారు. మతకలహాలు సృష్టించి ఓట్లు కొల్లగొట్టాలని బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కారు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.

Recent

- Advertisment -spot_img