IPL : Delhi Capitalsతో జరిగిన మ్యాచ్‌లో Rajasthan Royals 12 పరుగుల తేడాతో గెలుపొందింది. RR విధించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC 20 ఓవర్లలో 173 పరుగులే చేయగలిగింది. డేవిడ్ వార్నర్(49) , స్టబ్స్(44) రాణించినా ఫలితం లేకపోయింది. అంతకుముందు RR బ్యాటింగ్ లో రియాన్ పరాగ్ 45 బంతుల్లో 84 పరుగులతో చెలరేగాడు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడి జట్టు గెలుపుకు బాటలు వేశాడు. ఆఖరి ఓవర్లో 25 పరుగులు వచ్చాయి.