Homeహైదరాబాద్latest NewsRajendra Prasad : పేరుకే గొప్ప నటుడు.. చేసేవన్నీ చిల్లర పనులు

Rajendra Prasad : పేరుకే గొప్ప నటుడు.. చేసేవన్నీ చిల్లర పనులు

Rajendra Prasad : తెలుగు సినీ నటుల్లో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఒకరు. ఎన్టీఆర్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించిన రాజేంద్రప్రసాద్ ఎక్కువగా కామెడీ సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే రాజేంద్రప్రసాద్ తన మాటలతో చాల సార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో రాజేంద్రప్రసాద్ ఒక సినిమా షూటింగ్ లో ఒక హీరోయిన్ ను బాగా ఇబ్బంది పెట్టాడు అని వార్తలు వచ్చాయి. అయితే ఆ హీరోయిన్ రాజేంద్రప్రసాద్ తో హీరోయినిగా సినిమా తీసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో రాజేంద్రప్రసాద్ ప్రవర్తన నచ్చక ఆమె చాలా ఇబ్బంది పడ్డింది. ఆ సినిమా తరువాత ఆ హీరోయిన్ అసలు హీరోయినిగా సినిమాలు చేయడమే మానేసింది.

అలాగే ఇటీవలే స్టార్ హీరో అల్లు అర్జున్ పై కూడా రాజేంద్రప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటి సినిమా కథలకి కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయి. వాడెవడో చందనం దుంగల దొంగ.. వాడు హీరో’.. హీరోల్లో మీనింగ్ మారిపోయింది అంటూ అల్లు అర్జున్ నటించిన ”పుష్ప” సినిమాలోని పుష్పరాజ్ పాత్రపై పరోక్షంగా
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి రాజేంద్రప్రసాద్ తన మాటలతో వివాదాల్లో నిలిచారు.

హీరో నితిన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను రాజేంద్రప్రసాద్ వేదికపైనే అందరి సమక్షంలో రాజేంద్రప్రసాద్ అవమానించాడు. క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నాడు..రేయ్ వార్నర్.. దొంగ ముండా కొడుకు.. ఇదే వార్నింగ్.. అంటూ రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని అని రాజేంద్రప్రసాద్ అన్నారు. అయితే రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. దీంతో రాజేంద్రప్రసాద్ వార్నర్ అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. అయితే చాలా మంది నటన ఉంటే సరిపోదు మంచి సంస్కారం కూడా ఉండాలి అని అంటున్నారు. మరి ఇక ముందు అయిన రాజేంద్రప్రసాద్ స్టేజిపై నోరు జారకుండా మాట్లాడుతారుఏమో చూడాలి.

Recent

- Advertisment -spot_img