Rajendra Prasad : నితిన్ హీరోగా నటించిన సినిమా ”రాబిన్ హుడ్”. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది.అలాగే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఒక అతిధి పాత్రలో నటించాడు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు. అయితే డేవిడ్ వార్నర్‌పై నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డేవిడ్ వార్నర్‌ను వేదికపైనే అందరి సమక్షంలో రాజేంద్రప్రసాద్ అవమానించాడు. వార్నర్‌ని రేయ్ అని సంబోధించారు. క్రికెట్ ఆడవయా అంటే యాక్టింగ్ చేస్తున్నావా.. మామూలోడు కాదండి వీడు.. రేయ్ వార్నర్.. దొంగ ముండా కొడుకు.. ఇదే వార్నింగ్.. అంటూ రాబిన్ హుడ్ లాంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని అని రాజేంద్రప్రసాద్ అన్నారు. అయితే రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ క్రికెటర్ వార్నర్‌ను ఇలా అవమానించడం సరికాదని వారు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై వెంటనే రాజేంద్రప్రసాద్ క్షమాపణ చెప్పలని వార్నర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.