ధనుష్ ‘రాయన్’ సినిమాతో తక్కువ సమయంలోనే 100 కోట్ల రూపాయలను వసూలు చేసి భారీ రికార్డు సృష్టించాడు. అలా ధనుష్ సినిమా కెరీర్ లో జెండా ఎగురవేస్తున్నాడు. అయితే, అతని వ్యక్తిగత జీవితం వివాదాలతో నిండిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే వీరి వైవాహిక జీవితం నిలవలేదు. అయితే వీరిద్దరూ విడాకుల కోసం కూడా దాఖలు చేసారు. కానీ విడాకుల విషయంలో హీరో ధనుష్, ఐశ్వర్య మాత్రం కోర్టు కు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ధనుష్-ఐశ్వర్యల గురించిన కొత్త సమాచారం బయటికి వచ్చింది. దీని ప్రకారం దీపావళి రోజున రజనీకాంత్ ఇంట్లో ధనుష్, ఐశ్వర్యలు కలుసుకున్నారని, ధనుష్‌తో రజనీ మాట్లాడారని తెలుస్తుంది. అంతే కాకుండా ధనుష్ తప్పకుండా మళ్లీ కలుస్తానని రజనీకి మాట ఇచ్చాడు. ఆ రోజు ధనుష్ మరియు ఐశ్వర్య దీపావళిని సంతోషంగా జరుపుకున్నారని మరియు దీని కారణంగా రజనీకాంత్ కూడా సంతోషంగా ఉన్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.