సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ హిట్ తర్వాత విడుదలైన సినిమా ‘వేట్టయన్’ నేడు (అక్టోబర్ 10, గురువారం) రిలీజైంది. ఈ సినిమా రజనీకాంత్ నటించిన 170 సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా సాగే ‘వేట్టయాన్’ కథని ఆలోచన రేకెత్తించే సోషల్ మెసేజ్ తో దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా చూపించాడు. రజినీకాంత్ మాస్ అప్పీల్ అదిరిపోయింది. అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం బావున్నాయి. అమితాబ్, రానా, ఫహద్, మంజూ వారియర్ మెప్పించారు. భావోద్వేగ సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. ఒకే లైన్ మీద స్టోరీ సాగడం కాస్త మైనస్.
రేటింగ్: 3/5