Rajiv Gandhi International Airport Expansion Plan : రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ ప్రణాళిక..
హైదరాబాద్ నుంచి విమానయాన గమ్యస్థానాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ విస్తరణ ప్రణాళిక శరవేగంగా అమలు జరుగుతున్నది.
ఈ ప్రణాళికలో భాగంగా టర్మినల్, ఎయిర్‌సైడ్ ప్రాంతాల్ని అభివృద్ధిపరుస్తున్నారు.
ఈ విమానాశ్రయ నిర్వహణా సంస్థ జీఎమ్మార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎక్కువ విమానాల్ని నిలిపిఉంచేందుకు మరిన్ని ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్‌ల్ని, విమానరాకపోకలకు మరిన్ని రన్‌వేలను నిర్మిస్తున్నట్లు తెలిపింది.
తొలుత వార్షికంగా 1.2 కోట్ల మంది ప్రయాణికుల నిర్వహణా సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్ట్… విస్తరణ తర్వాత 3.2 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే సామర్థ్యం నెలకొంటుందని జీఎమ్మార్ పేర్కొంది. వివరాలివీ…
- విస్తరణ తర్వాత ఎయిర్‌సైడ్‌లో బోయింగ్ 737-700, ఏ320 సైజ్ విమానాల్ని నిలపగల 93 కోడ్ సీ ఎయిర్‌క్రాఫ్ట్ స్టాండ్‌లు ఉంటాయి.
- వీటిలో 44 కాంటాక్ట్ స్టాండ్‌లు కాగా, 49 రిమోట్ స్టాండ్‌లు.
- వెస్ట్రన్ ఏప్రాన్‌లో అంతర్జాతీయ కార్యకలాపాల కోసం అదనంగా 17 కాంటాక్ట్ స్టాండ్‌లు, ఒక రిమోట్ స్టాండ్ నెలకొంటాయి.
- దేశీయ విమానాల రాకపోకలు సాగించే ఈస్ట్రన్ ఏప్రాన్‌లో అదనంగా 17 కాంటాక్ట్ స్టాండ్‌లు, 4 రిమోట్ స్టాండ్‌లు ఏర్పాటవుతాయి.
- రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు ఇటీవల కొత్తగా నాలుగు ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలను ప్రారంభించారు.
- ఈ ట్యాక్సీవేలతో విమానాలు తక్కువదూరంలోనే రన్‌వే నుంచి గాలిలోకి ఎగరగలుగుతాయి. తద్వారా రన్‌వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, రన్‌వే సామర్థ్యం మెరుగుపడుతుంది.
- సెకండరీ రన్‌వే ఉపయోగించేటపుడు కా ర్యకలాపాలు సజావుగా సాగేందుకు కొ త్తగా ఒక సమాంతర ట్యాక్సీవే నిర్మించారు.
- విమానాలు, గ్రౌండ్ సర్వీస్ వాహనాల రాకపోకల సమయంలో ప్రయాణికులు, బ్యాగేజీ సురక్షితంగా తరలిపోయేందుకు ఒక నూతన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
- వర్షపు నీరు సాఫీగా ప్రవహించేందుకు వీలుగా 16 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని చదును చేశారు.
- అలాగే వాన నీటిని నిల్వచేసి, తిరిగి శుద్దిచేసిన తర్వాత ఉపయోగించుకోవడానికి 450 ఎంఎల్‌డీ సామర్థ్యంగల రిజర్వాయర్‌ను నిర్మించారు.
- ఇండియాలోనే పేపర్‌లెస్ ఈ-బోర్డింగ్ సదుపాయాన్ని కల్గిస్తున్న ఏకైక విమానాశ్రయం అయిన ఆర్‌జీఐఏ… ఇప్పుడు కృత్రిమ మేథతో పనిచేసే అడ్వాన్స్‌డ్ క్యూ మేనేజ్‌మెంట్ సొల్యూషన్లను ఉపయోగించడం మొదలుపెట్టింది.
- ఈ సొల్యూషన్స్ ద్వారా ప్రయాణికులు వేచి ఉండాల్సిన సమయం తెలుస్తుంది. సామాజిక దూరా న్ని పాటించడాన్ని పర్యవేక్షిస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో ప్రయాణికుల గణాంకాల్ని సరిగ్గా అంచనావేస్తుంది.