భారత ఎన్నికల సంఘం కొత్త కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన పని చేస్తారు.
1960 ఫిబ్రవరి 19వ తేదీన రాజీవ్ కుమార్ జన్మించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తన 36 ఏళ్ల ఉద్యోగ జీవితంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.
బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, పీజీడీఎం, ఎంఏ పబ్లిక్ పాలసీ ఆయన విద్యార్హతలు. సామాజిక, పర్యావరణం, అడవులు, మానవ వనరులు, ఆర్థికం, బ్యాంకింగ్ రంగాల్లో విస్తృత అనుభవం ఉంది. సాంకేతికత వినియోగంలో, ప్రభుత్వ విధానాల్లో పారదర్శకతకు, సేవలను నేరుగా ప్రజలకు చేర్చడంలో నిబద్ధతతో పని చేశారు.
ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ చేశారు. తర్వాత, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలెక్షన్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులై ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు సేవలు అందించారు.
రాజీవ్ కుమార్‌కు పర్వతారోహణంపై మక్కువ ఉంది. భారతీయ శాస్త్రీయ, భక్తి సంగీతం అంటే ఇష్టం