Rajiv Yuva Vikasam scheme: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాలు అందించనున్నారు. అయితే రాజీవ్ యువ వికాస్ యోజన కింద ఆరు విభాగాలలో సబ్సిడీలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయేతర పథకాలకు, దరఖాస్తుదారుడి వయస్సు 21-55 సంవత్సరాల మధ్య ఉండాలి. వ్యవసాయ అనుబంధ యూనిట్లకు ఇది 21-60 సంవత్సరాల మధ్య ఉండాలని తెలిపింది. కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హులుగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలు, పట్టణ (మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీ) ప్రాంతాల్లో రూ. 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులుగా నిర్ణయించారు.