Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడిన (ఈబీసీ) వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించనున్నారు. ఆర్థిక సహాయ పథకానికి మొదటిసారి దరఖాస్తు చేసుకునే మహిళలకు (ఒంటరి మహిళలు మరియు వితంతువులు) 25 శాతం, వికలాంగులకు 5 శాతం, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు, నైపుణ్యం గల వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.