- ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన సభ్యులు
- మహిళా బిల్లుకు జై కొట్టిన 171 మంది రాజ్యసభ సభ్యులు
- వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు
- డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్
- ఇప్పటికే లోక్ సభలో ఆమోదం
- రాష్ట్రపతి ఆమోదమే తరువాయి
- చారిత్రక బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టి.. అమోదించిన కేంద్ర ప్రభుత్వం
- అనివార్యంగా విపక్షాల మద్దతు
- అనుకూలం – 171 వ్యతిరేకం – 0
Rajya Sabha approves Women’s Bill: ఇదేనిజం, నేషనల్ బ్యూరో: మహిళా బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. గురువారం రాజ్యసభలో మహిళా బిల్లుపై 10 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 171 మంది సభ్యులు ఓట్లు వేయగా.. వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఓటేయలేదు. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందడంతో ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మహిళా బిల్లుకు ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలపగా.. తాజాగా రాజ్యసభ కూడా జై కొట్టింది. రాజ్యసభలో 171 సభ్యులు మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. అంతకుముందు ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ పై రాజ్యసభలో 10 గంటల పాటూ చర్చ జరిగింది. పార్లమెంటు ఉభయసభల్లోనూ మహిళా బిల్లు ఆమోదం పొందింది.
నన్నే అడ్డుకుంటారా?
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నటి జయా బచ్చన్ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ప్రసంగాన్ని కొందరు ఎంపీలు అడ్డుకోవడంతో.. తాను వ్యతిరేకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జయా బచ్చన్ ప్రసంగిస్తూ.. మహిళలను గౌరవించే ఈ సంప్రదాయం ‘ఆడంబరం’గా ఉండదని తాను ఆశిస్తున్నానని, ఇది ఇంకా కొనసాగుతుందని అన్నారు. లేకపోతే.. సభలోని మహిళల్ని మిమ్మల్ని (రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్) ప్లాస్టిక్ సర్జన్ అని పిలుస్తారని ఛలోక్తులు పేల్చారు. జయా బచ్చన్ ఇంకా మాట్లాడుతూ.. మీ (జగ్‌దీప్ ధన్‌కర్) కుర్చీ చాలా ఆసక్తికరంగా ఉందని, అదొక ఉయ్యాల తరహాలో అటూ ఇటూ కదులుతుంటుందని అన్నారు. అయినా.. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము ఎవరని ప్రశ్నించారు. తమకు ధైర్యం ఉంది కాబట్టి తాము పార్లమెంట్‌లో అడుగుపెట్టామని, తమ నాయకుల్లో ధైర్యం ఉంది కాబట్టే వాళ్లు తమని ఇక్కడికి తీసుకొచ్చారని అన్నారు.