Homeఫ్లాష్ ఫ్లాష్డ్రగ్స్‌ కేసు లీస్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌?

డ్రగ్స్‌ కేసు లీస్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌?

ముంబాయిః బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతికి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి విచార‌ణ సంద‌ర్భంగా అధికారుల‌కు డ్ర‌గ్స్ వాడే అల‌వాటు ఉన్న ప‌లువురి పేర్లు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా డ్రగ్స్‌ తీసుకునే అలవాటున్న మరికొంతమంది బాలీవుడ్‌ హీరోయిన్ల గుట్టు బయటపెట్టినట్లు సమాచారం. వీరిలో ప్రముఖ హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్ట పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రియా వెల్లడించిన దాదాపు 25 మంది పేర్లతో ఎన్‌సీబీ అధికారులు ఓ లిస్టు తయారు చేసినట్లు, వారంద‌రిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 8 నార్కోటిక్స్‌ కేసులో అరెస్టయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. రియాతో పాటు ఆమె సోదరుడు, మరో నలుగురు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించిన విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img