Homeఫ్లాష్ ఫ్లాష్Rakul Preet Singh : ఆమెపై వార్తలు రాయోద్దన్న కోర్టు

Rakul Preet Singh : ఆమెపై వార్తలు రాయోద్దన్న కోర్టు

Rakul Preet Singh : మాద‌క ద్ర‌వ్యాల కేసులో ర‌కుల్​ను ఎన్​సీబీ విచారణకు పిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే విచారణకు రకుల్​ హజరవడంతో ఈ కేసులో తనకు కూడా సంబందం ఉంద‌నే వస్తున్న వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు తెలిపింది.

ఈ విచార‌ణ‌లో తాను ఎప్పుడు డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని, రియానే త‌న ఇంట్లో డ్ర‌గ్స్ దాచిపెట్టింద‌ని పేర్కొంది.

ఇక మీడియాలో నిజ‌నిజాలు తెలుసుకోకుండా క‌థ‌నాలు రాస్తూ, మాన‌సికంగా వేధిస్తున్నార‌ని, ఆ వార్తలను వెంట‌నే ఆపేయాల‌ని ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించింది ర‌కుల్.

దీంతో ర‌కుల్ పిటీష‌న్‌ను స్వీక‌రించిన ఢిల్లీ హైకోర్టు కేంద్రంతో పాటు సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ర‌కుల్ వరకు డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు మీడియాలో ఆమెపై వార్తలు నియంత్రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

ర‌కుల్‌కు సంబంధించి ఎలాంటి నెగెటివ్​ వార్త‌లు రాయొద్దని, ఈ విష‌యంలో మీడియా కొంత స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని సూచించింది.

కాగా ర‌కుల్ రీసెంట్‌గా ముంబై నుండి హైద‌రాబాద్‌కు తిరిగి రాగా, ప్ర‌స్తుతం షూటింగ్స్‌లో పాల్గొంటుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img