Homeహైదరాబాద్latest Newsజిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ.. గాయపడ్డ రకుల్ ప్రీత్ సింగ్

జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ.. గాయపడ్డ రకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గాయపడింది. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భారీగా బరువును ఎత్తడం వల్ల రకుల్ ప్రీత్ సింగ్ తుంటికి గాయమైనట్లు తెలుస్తోంది. ఈ వార్త విన్న ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అక్టోబరు 5న జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ ఆమె గాయపడింది. డెడ్‌లిఫ్టింగ్‌లో 80 కిలోలు ఎత్తింది. ఆ సమయంలో ఆమె నడుము చుట్టూ సేఫ్టీ బెల్ట్ ధరించలేదు, అందువల్ల ఆమె తుంటి గాయానికి కారణమైంది. అయితే తుంటి నొప్పి ఉన్నప్పటికీ, వ్యాయామం కొనసాగించడంతో నొప్పి ఎక్కువైందని తెలుస్తోంది. అక్టోబర్ 10న రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు. ఆమె కూడా ఆ రోజు పార్టీలో పాల్గొంది. అప్పుడు ఆమెకు వెన్నునొప్పి వచ్చింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించగా ప్రస్తుతం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు రకుల్ విశ్రాంతి తీసుకుంటోంది.

Recent

- Advertisment -spot_img