మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్టార్ హీరోలు రామ్ చరణ్, ప్రభాస్ తాజాగా స్పందించారు. ‘రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపర్చడం కరెక్ట్ కాదు. రాజకీయాల కంటే గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని ప్రభాస్ అన్నారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. ఇలాంటి ప్రవర్తనను మేము సహించం.’ అని రామ్ చరణ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.