నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. ఈ టాక్ షో తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. బాలకృష్ణ తన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలయ్యతో అన్‌స్టాపబుల్ షోలో సందడి చేసారు. రామ్ చరణ్ కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా షోలో పాల్గొన్నారు. కాగా, ఈ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌తో పాటు శర్వానంద్ కూడా సందడి చేసారు.
మరోవైపు, రామ్ చరణ్ ఈ ఎపిసోడ్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఫోన్ చేసాడు. అయిత్ ఈ సారి ప్రభాస్ పెళ్లి సీక్రెట్ రామ్ చరణ్ బయటపెట్టాడు అని సినీ వర్గాలో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ ప్రభాస్‌తో ఫోన్‌లో ఏం మాట్లాడాడు అనే ఆసక్తి నెలకొంది. గతంలో ముందుగా ఈ షోకి ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు.. బాలయ్యతో కలిసి తన స్నేహితుడు రామ్ చరణ్ కి ఫోన్ చేసాడు. తర్వాత ప్రభాస్ సీక్రెట్స్, పెళ్లి తదితర విషయాలపై చరణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ స్పందించిన తీరు వైరల్ గా మారింది.