స్టార్ హీరో రామ్ చరణ్ అరుదైన ఘనత సాధించాడు. సినీ పరిశ్రమకు రామ్ చరణ్ చేసిన సేవలకు గుర్తుగా సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలు తీసుకున్నారు. 2025 వేసవి నాటికి చరణ్ విగ్రహం సందర్శకుల కోసం అందుబాటులోకి వస్తుంది. మేడమ్ టుస్సాడ్స్‌లోని ఇప్పటికే షారుక్, అమితాబ్ బచ్చన్, కాజోల్ మరియు కరణ్ జోహార్‌ల మైనపు విగ్రహాలు ఉన్నాయి.