Homeహైదరాబాద్latest NewsRam Charan : హిట్టు కోసం రామ్‌చ‌ర‌ణ్ మరో మల్టీస్టారర్.. ఈసారి తమిళ హీరోతో..!!

Ram Charan : హిట్టు కోసం రామ్‌చ‌ర‌ణ్ మరో మల్టీస్టారర్.. ఈసారి తమిళ హీరోతో..!!

Ram Charan : రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) ”గేమ్ ఛంజేర్” సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాగా ”RRR” లో నటించాడు. ఆ సినిమా భారీ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత చేసిన ”ఆచార్య”, ”గేమ్ ఛంజేర్” సినిమాలు చరణ్ కు నిరాశనే మిగిల్చింది. ఈ క్రమంలో ఈసారి ఎలగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేయబోతున్నాడు అని సమాచారం. ధనుష్ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడుగా, సింగర్‌గా, నిర్మాతగా తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ నాగార్జున తో కలిసి ”కుబేర” అనే సినిమాలో నటిస్తున్నాడు. రామ్‌చ‌ర‌ణ్ కూడా బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత సుకుమార్ తో సినిమా చేస్తాడు. ఆ సినిమాలు చేశాక ధనుష్ దర్శకత్వంలో రామ్‌చ‌ర‌ణ్ సినిమా ఉంటుంది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాలో ధనుష్ కూడా రామ్‌చ‌ర‌ణ్ తో కలిసి నటించబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హాప్యిగా ఉన్నారు.ramcharan dhanush ఇదేనిజం Ram Charan : హిట్టు కోసం రామ్‌చ‌ర‌ణ్ మరో మల్టీస్టారర్.. ఈసారి తమిళ హీరోతో..!!

Recent

- Advertisment -spot_img