Homeహైదరాబాద్latest NewsRam Charan : ఒకసారి హిందీలో దెబ్బతిన్న రామ్ చరణ్.. మరోసారి కొత్త మూవీతో రిస్క్...

Ram Charan : ఒకసారి హిందీలో దెబ్బతిన్న రామ్ చరణ్.. మరోసారి కొత్త మూవీతో రిస్క్ చేస్తున్నాడా..?

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ”RC 16” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అని సమాచారం. గతంలోనే రామ్ చరణ్ ”తుఫాన్” సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా 2013లో తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. కానీ ఆ సినిమాతో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్నాడు. ఆ తరువాత హిందీలో రామ్ చరణ్ నటన గురించి బాలీవుడ్ క్రిటిక్స్ తీవ్ర విమర్సలు చేసారు. అసలు ఆ సినిమా ఒకటి ఉంది రామ్ చరణ్ అభిమానులు మర్చిపోయారు. ఈ క్రమంలో రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ప్రముఖ హిందీ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన
నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాకి ఇంకా డైరెక్టర్ ఫిక్స్ కాలేదు అని తెలుస్తుంది. మరోవైపు సంజయ్ లీల బన్సాలి డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ఆల్రెడీ ఒకసారి రామ్ చరణ్ హిందీలో సినిమా చేసి బోల్తా పడ్డాడు.ఈ క్రమంలో మరోసారి అక్కడ సినిమా చేసి తాను ఏంటో ప్రూవ్ చేయాలనీ రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ హిందీ సినిమా షూటింగ్ మాత్రం బుచ్చిబాబు, సుకుమార్ లతో సినిమా పూర్తి చేసిన తరువాతే మొదలు అవుతుంది అని సమాచారం.

Recent

- Advertisment -spot_img