Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా రామ్‌చరణ్ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో చేతులు కలిపాడు. రిలయన్స్ సాఫ్ట్ డ్రింక్ కాంపా బ్రాండ్ అంబాసిడర్ గా రామ్‌చరణ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటించింది. మార్చి 2023లో మార్కెట్లోకి ప్రవేశించిన కాంపా వేగంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా రామ్‌చరణ్ చేసిన కాంపా ప్రత్యేక యాడ్ ”కాంపా వాలీ జిద్ద్” ను రిలీజ్ చేసారు.