Homeహైదరాబాద్latest Newsరామనామంతో మారుమోగిన రామాలయం

రామనామంతో మారుమోగిన రామాలయం

ఇదే నిజం, జనగామ: అయోధ్య శ్రీరామ మందిర బాలరాముడి ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలోని హనుమత్​ రామనాథ సహిత సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు. ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ప్రతిష్ఠాపన ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేవాలయ ప్రధాన అర్చకుడు మోహనకృష్ణ భార్గవ నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్జెల నర్సిరెడ్డి, పుజ్జూరి లక్ష్మీనర్సయ్య, జివిలికపల్లి సత్యనారాయణ, వేముల సదానందం, యెలసాని కృష్ణమూర్తి, మల్లారెడ్డి, యాదగిరి, రాంబాబు, కుర్రెముల రాంప్రసాద్, కళ్లెం నాగరాజు, హనుమారెడ్డి, పజ్జూరి శారద, మాదారపు కల్పన, కొత్తూరి మాధవి, గజ్జెల స్వరూప, నాగమణి, రాధిక, ఆకుల స్రవంతి, వరలక్ష్మీ, అలివేలు, విజయలక్ష్మీ తదితరులతో పాటుగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించారు.

Recent

- Advertisment -spot_img