ఇదే నిజం, గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. బుధవారం రామగుండంలోని కమిషనరేట్ భవనానికి వచ్చిన ఆయనకు కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు.