నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ‘రామాయణం’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రావడం లేదు. అయితే తాజాగా ఈ సినిమా బడ్జెట్ మరియు విడుదల తేదీపై ఆసక్తికర బజ్ ఒకటి వినిపిస్తుంది. ఏడాదిన్నరగా వార్తల్లో నిలుస్తోన్న ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌గా నిలువనుందట. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను రూ.835 కోట్లతో తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం ఫస్ట్ పార్ట్‌కే ఇంత ఖర్చు చేయనున్నారట. అలాగే ఈ మూవీని అక్టోబర్ 2027 లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.