హైడ్రా పేరుతో లేనిపోని హైప్ సృష్టిస్తున్నారని కమిషనర్ రంగనాథ్ పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? అని సందేహం వ్యక్తం చేశారు. ‘రంగనాథ్ ఖాకీ బట్టలు వదిలి ఖద్దర్ బట్టలు వేసుకోవాలి. కేవలం హిందువుల నిర్మాణాలనే కూలుస్తున్నారు. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.