Homeజిల్లా వార్తలుతిరుగులేని వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి : బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి

తిరుగులేని వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి : బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి

ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆమెలో ఉండే పోరాట ప్రతిభ,దేశభక్తి, అంకితభావం, ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని, విద్యార్థులు విద్యతో పాటు శస్త్ర విద్యలు కూడా నేర్చుకోవాలని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం బిచ్కుందలో ఏబీవీపీ గద్దె ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. చిన్నప్పటి నుండి విలువిద్య నేరుస్తూ, భారతదేశ దాస్య శృంఖలాలను త్రించాలని, బ్రిటిష్ వారిపై మొదటి స్వాతంత్ర సంగ్రామాన్ని ప్రారంభించిన ధీర వీర వనిత ఝాన్సీ రాణి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త స్వరూప కులకర్ణి మాట్లాడుతూ నా ఝాన్సీని ఎప్పటికీ వదలనని ప్రతిన భూనీ, ప్రాణం ఉన్నంతవరకు ఝాన్సీని కాపాడుకొని, బ్రిటిష్ వారికి చేత చిక్కకుండా విరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన ఝాన్సీ మనకు ఆదర్శం అన్నారు .బ్రిటిష్ వారి అకృత్యాలు సహించక యుద్ధ తంత్ర విద్యలన్నీ నేర్చుకొని, రణక్షేత్రంలో రణ చండీ అవుతారమెత్తి బ్రిటిష్ వారిని ముప్పతిప్పలు పెట్టిన తీర వనిత ఝాన్సీ అన్నారు. చత్రపతి శివాజీ నీ ఆదర్శంగా తీసుకుని, రాణా ప్రతాప్ పోరాట ప్రతిభని ఉనికి తెచ్చుకొని, వారి అడుగుజాడల్లో తంత్రాన్ని నేర్చుకొని, ప్రజలను కూడా సమయత్వం చేసిన వనిత. ఈరోజు మహిళలు తనకు తాను రక్షణ పొందాలి అనే ఆలోచనని కల్పించిన ధీరవీర వనిత అన్నారు .ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు బాస వినోద్, ముప్పిడి వెంకట్, సాకలి బాలు, గాల్మే విట్టల, అంబల్పూర్ రాజు,సంఘ నాయకులు మహిళా అధ్యక్షురాలు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆట పోటీలు నిర్వహించారు .గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.

Recent

- Advertisment -spot_img