Homeహైదరాబాద్latest Newsరానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు.. కేటీఆర్

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరు.. కేటీఆర్

గ్రూప్-1 పరీక్షలను రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని సమావేశంలో కేటీఆర్ హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని విమర్శించారు. మూడు రోజులుగా అభ్యర్థులు ధర్నాలు చేస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు అని తెలిపారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ను కలిశామని, 300 యూనిట్లు దాటితే ప్రస్తుతం యూనిట్‌కు రూ.10 వసూలు చేస్తున్నారని విమర్శించారు. జీఓ నంబర్ 29ని రద్దు చేసి జీఓ నంబర్ 55ని యథావిధిగా కొనసాగించాలని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గ్రూప్-1పై ఉన్న కేసులన్నీ క్లియర్ అయిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img