2019లో జనసేన నుంచి గెలిచి పార్టీని వీడిన రాపాక వరప్రసాద్ తిరిగి వచ్చి ఇప్పుడు జనసేన పార్టీ సమావేశంలో వేదికపై కనిపించారు. మలికిపురంలో జరిపిన జనసేన కార్యక్రమానికి హాజరైన రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను రాపాక వరప్రసాద్ కలిశారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన రాపాక ఇప్పుడు జనసేనలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీనిపై జనసేన సైనికలు రాపాక రాకను వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు రాజోలు జనసేనలో చర్చనీయాంశంగా మారింది. ఈమధ్య జరిగిన ఎన్నికలలో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసిన రాపాక వర ప్రసాద్ ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న రాపాక తాజాగా జనసేన పార్టీ సభా వేదికపై కనిపించారు. దీంతో రాపాక జనసేన పార్టీలోకి తిరిగి వస్తున్నారు అని తెలుస్తుంది.