17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక స్నానం చేస్తుండగా నిందితుడు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జుంజునులో డిసెంబర్ 2020లో చోటుచేసుకుంది. ఆ తర్వాత ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటనపై స్థానిక కోర్టు విచారణ జరిపి నిందితుడు సాహిరామ్ కి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.