Homeహైదరాబాద్latest News11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. టీచర్‌కు 111 ఏళ్ల జైలు శిక్ష..!

11వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. టీచర్‌కు 111 ఏళ్ల జైలు శిక్ష..!

ఐదేళ్ల క్రితం మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో ట్యూషన్ టీచర్‌ కు తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఆర్ రేఖ, 11వ తరగతి విద్యార్థికి సంరక్షకుడిగా ఉండాల్సిన ట్యూటర్ మనోజ్ కనికరం లేని నేరానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. మైనర్ బాలికపై తన భర్త చేసిన నేరం గురించి తెలుసుకున్న మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి అయిన నిందితుడు తన ఇంట్లో విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడు. 2019 జులై 2న నిందితుడు ప్రత్యేక తరగతి సాకుతో బాలికను తన ఇంటికి వచ్చిన అత్యాచారం చేసాడు. ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితుడు ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా, తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీసాడు. ఈ సంఘటన తర్వాత బాలిక మానసిక క్షోభకు గురై భయపడి ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులకు విషయాన్ని వెల్లడించగా, వారు ఫోర్ట్ పోలీస్ స్టేషన్‌లో టీచర్‌ పై ఫిర్యాదు చేశారు. టీచర్‌ మనోజ్‌ను తరువాత అరెస్టు చేశారు.

Recent

- Advertisment -spot_img