Rape on Hijra : పులివెందులలో 50 ఏళ్ల హిజ్రాపై 8 మంది అత్యాచారం
Rape on Hijra : కడప జిల్లా పులివెందులలో 50 ఏళ్ల హిజ్రాపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. పులివెందులకు చెందిన పి.చక్రధర్, కె.చలపతి, ఎ.బాలగంగి, పి.గురుప్రసాద్, కె.కుమార్, ఎస్ బ్రహ్మయ్య, పి.జయచంద్రశేఖర్, ఎం.హరికృష్ణ, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు సురేంద్ర, షాకీర్, సుభాష్ కలిసి ఓ పంచాయితీ విషయంలో రెండు వాహనాల్లో సత్యసాయి జిల్లాలోని రాగన్నగారిపల్లెకు వెళ్లారు.
తిరిగి వస్తూ కదిరి రహదారిలోని గంగమ్మ గుడి దగ్గరకు చేరుకున్నారు.
అక్కడ అప్పటికే ఉన్న ఇద్దరు హిజ్రాల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
దీంతో బాధిత హిజ్రా బుధవారం దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కదిరి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో 8 మంది నిందితులను నిన్న అరెస్ట్ చేశారు.
మరో ఐదుగురి కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.