పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో అపరాజిత స్త్రీ, శిశు సంరక్షణ (అత్యాచార నిరోధక) బిల్లును బెంగాల్ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు. అత్యాచారానికి పాల్పడే వారిని 10 రోజుల్లో ఉరి శిక్ష వేయడమే ఈ చట్టం లక్ష్యమని సీఎం వివరించారు.