రాశీ ఖన్నా.. ప్రస్తుతం తెలుగులో మంచి ఫాంలో ఉన్న హీరోయిన్. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొడుతుంది రాశి. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే రాశి ఖన్నా అటు వెస్టర్న్ లుక్‌తో పాటు ఇటు సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు దిగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’లో నటించి సూపర్ హిట్ అందుకుంది. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. అది అలా ఉంటే వినాయక చవితి సందర్భంగా పూజలు చేసిన రాశీ ఖన్నా కొన్ని పిక్స్ షేర్ చేసింది.