ఇదేనిజం, నేషనల్ బ్యూరో: రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఓ కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడే వీడియో సృష్టించినట్టు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ డీప్ ఫేక్ వీడియో కేసును విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే వీడియో క్రియేట్ చేసిన దక్షిణ భారతదేశానికి వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. సోషల్ మీడియా తార జారా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఉపయోగించిన విషయం తెలిసిందే. అయితే సదరు నిందితుడు ఏపీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.