Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి గాయపడింది. ”యానిమల్” మరియు ”పుష్ప 2: ది రూల్” వంటి సినిమాలతో బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమా ”సికందర్”లో హీరోయినిగా చేస్తుంది. ఇటీవల జిమ్ చేస్తుండగా రష్మిక మందన్న గాయపడింది. గాయం కారణంగా రష్మిక నటిస్తున్న ‘సికందర్’ సినిమా షూటింగ్‌కి అంతరాయం ఏర్పడింది. గాయం చిన్నదే అయినా వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.త్వరలోనే ఆమె షూటింగ్‌లకు వెళ్తుందని రష్మిక సన్నిహితులు తెలిపారు.