Homeహైదరాబాద్latest NewsRashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికపై కన్నడ ప్రజల ఆగ్రహం.. ఎందుకంటే..?

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికపై కన్నడ ప్రజల ఆగ్రహం.. ఎందుకంటే..?

Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్న వరుస సినిమా విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తున్న రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసి, కన్నడ ప్రజల నుండి ఆమెపై విమర్శల వర్షం కురిపించాయి.

ఒక ఇంటర్వ్యూలో రష్మిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. తాను కొడవ కమ్యూనిటీ నుండి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ నేనే అని రష్మిక మందన్న చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. రష్మికకు తన సొంత కమ్యూనిటీ చరిత్ర తెలియదని, ఆమె వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని కన్నడ ప్రజలు ఆరోపించారు. వాస్తవానికి కొడవ సమాజం నుండి ఇప్పటికే పలువురు నటీమణులు కన్నడ చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేశారు. ప్రముఖ నటీమణులైన ప్రేమ, హర్షిక పూనచ్చ, శుభ్ర అయ్యప్ప వంటి వారు అనేక సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో వీరి పేర్లన్నీ మర్చిపోయావా..? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీంతో ర‌ష్మిక చేసిన కామెంట్స్ పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Recent

- Advertisment -spot_img