Rashmika mandanna : రష్మిక మందన్న (Rashmika mandanna) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. నేషనల్ క్రష్ భామ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత ఏడాది విడుదలైన ”పుష్ప 2” సినిమాతో తెలుగులో భారీ విజయం సాధించగా ఇటీవలే ”చావా” సినిమాతో కూడా మరో హిట్టును అందుకుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో ”సికందర్” మూవీ చేస్తుంది. ఈ సినిమా ఈద్ పండుగ సందర్భంగా విడుదల కానుంది. కానీ రష్మిక షాకింగ్ నిర్ణయం తీసుకుంది అని సినీ వర్గాల్లో టాక్ అందిస్తుంది. ప్రస్తుతం రష్మిక అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయినిగా ఎదిగింది. ఈ క్రమంలో ఆమె ఇకపై సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకుంది అని సమాచారం. ఇందుకు కారణం ఆమె పెళ్లి చేసుకోబోతుంది అని సన్నిహితులు అంటున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారు అన్న విషయం అందరికి తెల్సిందే. అయితే వీరిద్దరూ ఈ ఏడాది చివరిలో పెళ్ళికి రెడీ అవుతున్నారు అని సినీ వర్గాలు అంటున్నాయి. అందుకే రష్మిక పెళ్లి సినిమాలు చేయకూడదు అని ఈ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తుంది. వీరి పెళ్ళికి ఇరువైపు కుటుంబాలు ఒపుకోగా.. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు.