Rashmika Mandanna has been working out by the beach in Goa recently and videos shared by her trainer are all anyone can talk about.
హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్ లిస్టులోకి చేరింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.
ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాలో నటిస్తోన్న ఈ సొగసరి ఆచార్యలో చరణ్‌తోనూ నటించే అవకాశం ఉందని అంటున్నారు.
తెలుగుతో పాటు తమిళంలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోన్న ఈ అమ్మడు ఈ ఏడాది సూపర్‌స్టార్ మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’తో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే రష్మిక మందన్నా.. తొలిసారి తన బీచ్ వర్కవుట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
“ఇది నేను చేసిన మొదటి బీచ్ వర్కవుట్ వీడియో. సముద్ర అలల శబ్దం, సముద్రం మట్టి వాసన, సూర్యాస్తమయం, నా పాదాల వ్యతిరేకంగా ఇసుక, ఇది ఎంతో అందంగా ఉంది.
ఇక భవిష్యత్తులో ఇలాంటి వర్కవుట్ వీడియోలను తయారుచేయాలనుకుంటున్నాను” అనే మెసేజ్ కూడా షేర్ చేసింది రష్మిక.