Homeహైదరాబాద్latest NewsRashmika Mandanna : ఒక్క ఫ్లాప్‌తో.. రష్మిక ఆశలు అడియాశలు

Rashmika Mandanna : ఒక్క ఫ్లాప్‌తో.. రష్మిక ఆశలు అడియాశలు

Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ భామ హీరోయినిగా చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ భారీ కలెక్షన్స్ రాబెడుతున్నాయి. వరుస విజయాలు తర్వాత.. సల్మాన్ ఖాన్ తో నటించిన ”సికందర్” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘పుష్ప’, ‘యానిమల్’, ‘ఛవా’ లాగా ”సికందర్” సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే ఆశ అడియాసలైంది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన ”సికందర్” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.

ఈ క్రమంలో రష్మిక కెరీర్ కు పెద్ద దెబ్బ తగిలింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో రష్మికకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ షాక్ ఇచ్చాడు. ‘యానిమల్’ సినిమా తరువాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో ”స్పిరిట్” అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో సందీప్ రష్మిక మందన్నను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ”సికందర్” సినిమా ప్లాప్ తర్వాత చిత్ర బృందం ప్రభాస్ సినిమా నుండి రష్మికను తొలగించి ఇతర హీరోయిన్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం. రష్మిక ప్రభాస్ తో చేయబోయే సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఆ ఆశలు అన్ని అడియాశలు అయిపోయాయి.

Recent

- Advertisment -spot_img