Rashmika : రష్మిక మందన్నా (Rashmika) ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ భామ హీరోయినిగా చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ భారీ కలెక్షన్స్ రాబెడుతున్నాయి. ఇటీవలే వచ్చిన ”పుష్ప 2”, ”చావా” సినిమాలు భారీ విజయం కావడంతో ఈ భామ మంచి జోష్ లో ఉంది. ప్రస్తుతం ఈ భామ అట్టు తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా రష్మిక స్పీడుకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బ్రేక్ వేసాడు. సల్మాన్ ఖాన్ తో కలిసి రష్మిక ”సికిందర్” అనే సినిమాలో నటించింది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చ్ 30న విడుదల కాగా.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సల్మాన్ ఖాన్ సినీ కెరీర్ లో మరో ఫ్లాప్ రాగా.. వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న రష్మిక ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది.