Homeహైదరాబాద్latest Newsఅధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ముంబైలోని వర్లీలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. అంత్యక్రియల్లో కేంద్రం తరపున హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అంతకుముందు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు కూడా అంతిమయాత్రలో పాల్గొన్నారు.ముంబైలో రతన్ టాటాకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్‌పర్సన్ నీతా అంబానీ నివాళులర్పించారు.

Recent

- Advertisment -spot_img