బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. బుధవారం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్‌కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. మరోవైపు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఉప్పల్ టిక్కెట్ హామీతో ఆయన బిజెపిలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉప్పల్ టికెట్‌ను బీజేపీ ఎవరికీ కేటాయించలేదు. థర్డ్ లిస్ట్‌లో ఉప్పల్ నుంచి భేతి సుభాష్ రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.