Ration Card: హైదరాబాద్ నగర వాసులకు సన్నబియ్యం అన్నం తినే భాగ్యం వచ్చే నెలలోనే కలగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో సన్నబియ్యం పంపిణీ జరగడం లేదు. ఏప్రిల్ 29 వరకు ఎన్నికల నిబంధనలు అమలులో ఉంటాయి. నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 653 రేషన్ షాపులు ఉన్నాయి. వీటన్నింటిలోను మే నెలలో సన్న బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.