Homeహైదరాబాద్latest NewsRation Card : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!!

Ration Card : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన..!!

Ration Card : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల కోసం వాట్సాప్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయని సమాచారం ఉంది. మే 7, 2025 నుంచి రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కీలక ప్రకటన చేశారు. మే 15 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తామని ఆయన అన్నారు. వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించారు. ఈ క్రమంలో డిజిటిల్ రేషన్ కార్డును అందిబాటులోకి తీసుకువస్తునట్లు తెలిపారు. ఈ టెక్నాలజీతో కార్డులో సమస్యలు వచ్చిన.. లేదుంటే మార్పులు చేయాలన్నా ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది అని అన్నారు.

వాట్సాప్‌లోని ”మన మిత్ర” ప్లాట్‌ఫారమ్ ద్వారా మీరు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ మొబైల్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. మీరు దీన్ని ఇప్పటికే సేవ్ చేసి ఉండవచ్చు. ఈ నంబర్ ద్వారా, కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు, చిరునామా మార్పులు, కుటుంబ సభ్యుల చేర్పులు లేదా తొలగింపు, కార్డు విభజన, కార్డు సరెండర్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వాట్సాప్‌తో పాటు కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు చేస్కోవచ్చు.దరఖాస్తు ఫారమ్‌తో పాటు, అవసరమైన పత్రాలను జతచేయాలి. వాట్సాప్ లేని వారికి ఈ విధానం సులభం అవుతుంది.

Recent

- Advertisment -spot_img