Ration Card: తెలంగాణలో ఉగాది పర్వదినం 30వ తేదీ సా. 6 గంటలకు హుజూర్నగర్ కేంద్రంగా సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం 20 మంది రేషన్ కార్డుదారుల్ని ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 91,19,466 రేషన్‌కార్డులు ఉండగా, సన్న ఒక్కొక్కరికి 6KGల చొప్పున 2.82కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.