Ration Card: తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల సంఖ్యను అనుసరించి ఒక్కొక్కరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు. వర్షాకాలం నుంచి సన్న ధాన్యానికి క్వింటా ధాన్యంపై రూ.500 బోనస్ అందిస్తోంది. ఈ విధానంలో రైస్ మిల్లుల్లో ప్రాసెస్ చేయడంతో 8 లక్షల టన్నుల సన్న బియ్యం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 91,19,268 రేషన్ కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య 2,82,77,859గా ఉంది.